సమయ న్యూస్ 2014 నుండీ తప్పుడు వార్తలు, ప్యానెల్ చర్చలు, పరువుకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు, కార్యక్రమాలు ప్రసారం చేస్తూ వచ్చింది. సమయ న్యూస్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ప్రస్తుతం భారత దేశంలో సాధారణంగా మారిన “మీడియా ట్రయల్” నిర్వహించిందని గౌరవ న్యాయస్థానం గ్రహించింది. సమయ న్యూస్ ఛానెల్, రంగనాథ్ భరద్వాజ్ తమను తాము నియంత్రించుకుని ఉండాల్సిందని అందుకు విరుద్ధంగా వారు వివిధ కార్యక్రమాలతో ముందుకు వెళ్లారని కోర్టు వెల్లడించింది.
ఫిల్మ్ నిర్మాత మదన్ పటేల్ పై కోర్టు విరుచుకు పడింది. స్వామి నిత్యానంద జీవితం ఆధారంగా నిర్మించారు అని చెప్పిన “సత్యానంద” సినిమా కు మదన్ పటేల్ నిర్మాత. ఈ సినిమా ను ఖండిస్తూ గౌరవ సివిల్ కొర్టు సెన్సార్ కత్తిరింపులను ప్రతిపాదించింది.
ఆరోపణలను ఎదుర్కొంటున్న వీరు కేవలం స్వామి నిత్యానంద పేరు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కార్యక్రమాలను ప్రసారం చేయటం, ఎడిట్ చేయటం, మొదలైన పనుల్లో చురుగ్గా పాల్గొన్నారని తద్వారా స్వామి నిత్యానంద, ఆయన ఆశ్రమాలపై కుట్రలు పన్నారని కోర్టు గ్రహించింది. నీచమైన దుర్భాషలు, భయాందోళనలకు గురి చేయటం వంటి తీవ్ర నేరాల ద్వారా స్వామి నిత్యానంద జీవితానికి ముప్పు కలిగించేలా చేశారని కోర్టు గ్రహించింది.
స్వామి నిత్యానందకు న్యాయం చేకూరేలా ఇప్పటివరకూ వచ్చిన తీర్పుల పరంపరలో ఇది ఒకటి. స్వామి నిత్యానంద, నటి రంజిత తో కలిసి ఉన్నట్టుగా మార్ఫ్ చేసి సృష్టించిన అబద్ధపు వీడియోల ఆధారంగా స్వార్థ ప్రయోజనాలకోసం ఎన్నో తప్పుడు కేసులు బనాయించారు.
డిసెంబర్ 7, 2017 న గౌరవ భారత సుప్రీం కోర్టు కూడా స్వామి నిత్యానంద కు అనుకూలమైన తీర్పులో కీలకమైన సాక్ష్యాలను ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి పెట్టినందుకు తీవ్రంగా విరుచుకు పడింది. అందులో “స్వామి నిత్యానంద తో తన వీడియో అబద్ధమని, దాన్ని మార్ఫ్ చేశారని” నటి రంజిత ఇచ్చిన వాంగ్మూలం, కుట్రదారులు లెనిన్ కరుప్పన్, అబద్ధపు రేప్ బాధితురాలు ఆరతి రావు, అబద్ధపు సాక్షి వినయ్ భరద్వాజ్ లకు వ్యతిరేకంగా స్వామి నిత్యానందకు అనుకూలంగా ఉన్న సాక్ష్యాలు ఉన్నాయి.
ఈ ఆధారాలలో ఈ క్రింది అంశాలు వున్నాయి.
Read the article in other languages
స్వామి నిత్యానంద కు అనుగుణంగా అడిషనల్ సివిల్ జడ్జ్ గౌరవ న్యాయస్థానం మరియు JFMC రామనగర సమయ న్యూస్ ఛానెల్ , సమయ న్యూస్ చీఫ్ ఎడిటర్ మరియు యాంకర్ రంగనాథ్ భరద్వాజ్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ మదన్ పటేల్, తనను తానె కార్యకర్త గా చెప్పుకునే భీమా శంకర్ పాటిల్ లపై నేర పూరిత భయాందోళనలకు గురి చేయటం, ఉద్దేశ్య పూర్వకంగా అవహేళన చేసి అశాంతి నెలకొల్పటం, పరువునష్టం కలిగించటం వంటి అనేక తీవ్రనేరాలపై కేసు నమోదు చేయమని మరియు సమన్లు జారీ చేయమని ఆర్డర్ ఇచ్చింది.