స్వామి నిత్యానంద కేసులో ప్రముఖ కన్నడ ఛానెల్ కు అమెరికాలో దండన.
ప్రముఖ కన్నడ న్యూస్ ఛానెల్ సమయ టీవీ ఛీఫ్ రిపోర్టర్ రఘునాథ్ భరద్వాజ్ మరియు కళావతి భరద్వాజ్ లను పరువు నష్టం, సివిల్ కుట్రలలో నిందితులుగా తేల్చిన అమెరికన్ కోర్టు.
అమెరికన్ కోర్టు., స్వామి నిత్యానంద పైన , ఆయన అమెరికన్ మిషన్ పైన తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసినందుకు
ప్రముఖ కన్నడ న్యూస్ ఛానెల్ సమయ టీవీ ఛీఫ్ రిపోర్టర్ రఘునాథ్ భరద్వాజ్ మరియు కవిత భరద్వాజ్ లను అపఖ్యాతి, సివిల్ కుట్ర దారులు, నిందితులుగా తేల్చి 5 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
అమెరికన్ కోర్టు పూర్తి వివరాలతో చైల్డ్ రేపిస్ట్ వినయ్ భరద్వాజ్ ను దోషిగా నిర్ధారించి, 4.75 సంవత్సరాల జైలు శిక్షను తీర్మానించిన తరువాత కూడా వినయ్ ని అమాయకుడిగా కావాలని చిత్రీకరించి, తప్పుడు సమాచారం ప్రసారం చేయటం, కోర్టు ధిక్కారం, అసత్యాలను విస్తారంగా ప్రసారం చేసినందుకు అమెరికన్ కోర్టు తీవ్రంగా పరిగణించింది.
అంతర్జాతీయంగా ఈ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కోర్టు ధిక్కారం, స్వామి నిత్యానంద ను దూషిస్తూ , లేని పోని అబాండాలు వేసి , అగౌరవ పరచటం క్రిందికి వచ్చాయి.
అహంకార పూరితమైన సమయా టీవీ చేష్టలపై, కార్యక్రమ వ్యాఖ్యాత రఘునాథ్ భరద్వాజ్ కార్యక్రమంలో పాల్గొన్న కళావతి భరద్వాజ్ లకు అమెరికన్ కోర్టు తీవ్రమైన నోటీసు ఇచ్చి చర్యలను తీసుకుంది.
2014 లో జుగుప్సా కరమైన, ద్వేషంతో కూడి పరువు నష్టానికి దారి తీసిన వార్తలను ప్రసారం చేసినందుకు లైఫ్ బ్లిస్ ఫౌండేషన్ Vs సమయ టీవీ, RSM బ్రాడ్ కాస్టర్స్ ప్రయివేట్ లిమిటెడ్, రఘునాథ్ భరద్వాజ్, AV కళావతి భరద్వాజ్ మధ్య కేసు నడిచింది. (Case No: CIVRS 1410615 filed in the Superior Court of California, County of San Bernardino).
వినయ్ భరద్వాజ్ గురించి:
వినయ్ కే భరద్వాజ్ చైల్డ్ రేప్ కేసులో అమెరికాలో జైలు శిక్ష అనుభవించాక చిన్న పిల్లల పై లైంగిక దాడి జరిపినందుకు అమెరికా అతడిని భారత దేశానికి వెనక్కి పంపించింది. వినయ్ భరద్వాజ్ ప్రస్తుతం అమెరికన్ కోర్టు భారత దేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ మరియు సీజేఎం మైసూరు కోర్టు ద్వారా అక్టోబర్ 16, 2017 లో విధించిన $500,000+ జరిమానా కట్టకుండా పరారీలో ఉన్నాడు.
XI మెట్రో పోలిటన్ కోర్ట్ , సైదాపేట్ , చెన్నై లో దర్యాప్తులో ఉన్న కుట్ర, బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలు ఉన్న కేసులో వినయ్ భరద్వాజ్ ఒక ప్రధాన ముద్దాయి. కుట్రదారుడు లెనిన్ కురుప్పన్ 2010 లో దాఖలు చేసిన దొంగ కేసు లో వినయ్ భరద్వాజ్ ఒక సాక్షి. డిసెంబర్ 7, 2017 లో భారత సుప్రీం కోర్ట్ ఇచ్చిన సంచలన తీర్పులో కేసు దాఖలు చేసిన లెనిన్ కురుప్పన్ పై, దొంగ సాక్షి , దొంగ బాధితుడైన వినయ్ పై ముఖ్యమైన సాక్ష్యాలను ఉద్దేశ్యపూర్వకంగా దాచినందుకు తీవ్రంగా విరుచుకు పడింది, స్వామి నిత్యానందకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఆ సాక్ష్యాలలో ఈ క్రిందివి ఉన్నాయి.
ఆరోపించబడ్డ బాధితురాలు ఆరతి రావుకు గల భయంకరమైన 4 సుఖ వ్యాధులు,
2004 నుండి 2009 వరకు ఉన్న మెడికల్ రిపోర్టులు,
2009 లో ఆరోపణలు చేసిన 6 నెలల తరువాత ఆమెకు స్వామి నిత్యానంద తో ఎటువంటి లైంగిక సంబంధాలు లేవని పంపిన ఇ-మెయిల్,
రేప్ ఆరోపించబడిన తేదీలు, స్థానాలలో పలు వ్యత్యాసాలు,
నిత్యానంద స్వామికి ఎటువంటి సుఖ వ్యాధులు లేవని, ఆయనకు ఉన్న యోగ శరీరంతో ఎటువంటి లైంగిక చర్యలు సాధ్యం కాదనే మెడికల్ రిపోర్ట్,
వీడియో అబద్ధం, మార్ఫ్ చేశారని ఈ కేసులో ప్రధాన సాక్షి రంజిత ఇచ్చిన వాంగ్మూలం.
కుట్రదారులు ప్రస్తుతం చెన్నై కోర్ట్ లో స్వామి నిత్యానందను బ్లాక్ మెయిల్ చేయటం, బెదిరించి డబ్బు గుంజటం, క్రిమినల్ కుట్ర వంటి అంశాలలో విచారణలో ఉన్నారు.